హైదరాబాద్‌లో H-FAST తనిఖీలు .. 25 టన్నుల కల్తీ నెయ్యి సీజ్

హైదరాబాద్‌లో H-FAST తనిఖీలు .. 25  టన్నుల కల్తీ నెయ్యి  సీజ్


 హైదరాబాద్ సిటీలో   ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ కేటుగాళ్ల గుట్టును అధికారులు రట్టు చేశారు. హైదరాబాద్ కమిషనర్ టాస్క్‌ఫోర్స్‌కు చెందిన హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందాలు నగరంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. సీటీ కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో అసాధారణ రీతిలో జరుగుతున్న కల్తీ నెయ్యి తయారీ , విక్రయ యూనిట్లపై అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో భారీ ఎత్తున కల్తీ నెయ్యి గుట్టు రట్టయింది. అధికారులు సుమారు 25.5 టన్నుల కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే, ఈ నెయ్యి తయారీకి వినియోగిస్తున్న మరో 10.5 టన్నుల హానికరమైన ముడి పదార్థాలను కూడా సీజ్ చేశారు. ఇలా మొత్తంగా దాదాపు 36 టన్నుల కల్తీ నెయ్యి , తయారీ సామగ్రిని అధికారులు తమ స్వాధీనంలోకి తీసుకున్నారు.

ప్రజల ఆరోగ్యంతో ఆటలాడే కల్తీ రాయుళ్లపై హెచ్-ఫాస్ట్ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ భారీ ఆపరేషన్‌ను విజయవంతం చేశారు. ఈ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు, సూత్రధారులు ఎవరనే కోణానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కాసేపట్లో అధికారికంగా మీడియాకు వెల్లడించనున్నారు.